Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

మీరు తరుచుగా మీ సిస్టం ని ఫార్మేట్ చేస్తుంటారా?మీ ఫైర్ ఫాక్స్ బుక్ మర్క్స్ ఎలా మరి?-Firefox Bookmarks

మీరు తరుచుగా మీ సిస్టం ని ఫార్మేట్ చేస్తుంటారా?
లేదా ఘోస్ట్ లాంటి వాటితో రీస్టోర్ చేస్తుంటారా?
లేదా రిటర్నిల్ వంటి సాఫ్ట్వేర్ లను ఉపయోగిస్తున్నారా?


అయితే మీకు ఫైర్ ఫాక్స్ వాడుతున్నప్పుడు ఒక సమస్య ఎదురయ్యే ఉంటుంది
అదేంటంటే, బుక్ మార్క్స్

అవును
బుక్ మార్క్స లను మీరు ప్రతి సారి ఎక్స్ పోర్ట్ చేసుకుని , మళ్లీ
ఇంపోర్ట్ చేసుకుంటారు కదా?


అయితే ఆ పద్దతికి స్వస్తి చెప్పండి
చిన్న ట్రిక్ తో మీ బుక్ మార్క్స్ ని వాటంతటవే లోడ్ అయ్యేలా చేయండి
మీ సిస్టం రీస్టోర్ అనంతరం కూడా....



అయితే మీరు మీ పార్టిషన్ ని బ్యాకప్ తీసుకోక ముందే(ఘోస్ట్ తో అయితే )
రిటర్నిల్ వంటి సాఫ్ట్ వేర్స్ వాడుతున్నట్లైతే Returnil ని
ON చేయకముందేమీ
ఇది చేయాల్సి ఉంటుంది


అందుకోసం ఇలా చేయండి

ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి..


మీ బుక్ మార్క్స్ లను బ్యాకప్ తీసుకోండి
అందుకోసం Bookmarks-->Organise Bookmarks క్లిక్ చేసి


ఇప్పుడు వచ్చే విండో లో File-->Export



తీసుకుని, ఆ తర్వాత ఒక ఫైల్ నేం ఇచ్చి, మీకు కావాల్సిన డ్రైవ్ లో
సేవ్ చేసుకోండి

**** అంటే C Drive తప్పించి మిగతా ఏ డ్రైవ్ లోనైనా *** సేవ్ చేసుకోండి
మీరు ఈ ఒక్కసారే బుక్ మర్క్స్ సేవ్ చేసుకుంటారు

STEP 1
ఇప్పుడు
అడ్రస్ బార్ లో "about:config" అని టైప్ చేయండి
(కోట్స్ అవసరం లేదు)



STEP 2
ఇప్పుడు వచ్చే విండో లో

RIGHT Click చేసి,
NEW--> String మెనూ ని క్లిక్ చేయండి


ఇప్పుడు వచ్చే input బాక్స్ లో ఇలా టైప్ చేయండి



"browser.bookmarks.file"
(కోట్స్ అవసరం లేదు)
STEP 3
ఇప్పుడు మళ్లీ వచ్చే input బాక్స్ లో
మీరు బుక్ మార్క్ లను ఏ ఫైల్ పేరుతో సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ పూర్తి పేరుని ,
అంటే పాత్ తో సహా ఇవ్వండి




ఉదా కి నేను నా బుక్ మార్క్ లను
D డ్రైవ్ లో mybookmarks.html గా సేవ్ చేసుకున్నాను
కాబట్టి సెకండ్ input బాక్స్ లో


"D:\mybookmarks.html" అని ఇస్తాను

ఇప్పుడు మీ పార్టిషన్ ని బ్యాకప్ తీసుకోండి (ఘోస్ట్ తో అయితే )
రిటర్నిల్ వంటి సాఫ్ట్ వేర్స్ వాడుతున్నట్లైతే ఇప్పుడు ON చేసుకోండి



ఆ తర్వాత?
ఏముంది మీ కిష్టమైన సైట్ లను బుక్ మార్క్ చేస్తూ వెళ్లండి
హ్యాపీ బ్రౌజింగ్ :)

(అయితే ఇది ఒక మెథడ్ మాత్రమే శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు చెప్పినట్లు, గూగుల్ టూల్ బార్ ని ఉపయోగించి కూడా బుక్ మార్క్స్ లను చేసుకోవచ్చు, అప్పుడు ఎక్కడ నెట్ ఉంటే అక్కడే మన బుక్ మార్క్స్ అందుబాట్లో ఉంటాయి)

జీవి

2 comments:

Srinivas

August 13, 2008 at 10:09 AM

నమస్కారం Gv గారు,
నా పేరు Srinivas, సురత్ (గుజరాత్)నున్డి, post చెస్తున్నాను...
నా mozilla firefox లొ chatroom, forum load కవట్లెదు sir, అలాగె meebo.com, కుడా,
Status Bar లొ Done, అని చుపిస్తున్నది,కాని పెజి పుర్తిగా ఖాళిగా ఉంది..
మేరు ఎమైనా సహయం చెయగలరా?
ధ్న్యవాదాలు...

venkat

October 14, 2008 at 7:45 PM

GV Sir what you said is right ,it is the basic thing to backup your bookmarks before formatting and then restoring bookmarks after OS loading .