Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

భలే భలే బ్యాచ్ ఫైల్ లు ( Batch Files- Basics )

MS-DOS ప్రేమికులందరికీ, బ్యాచ్ ఫైల్స్ గురించి తెలిసే ఉంటుంది
బ్యాచ్ ఫైల్ తో,
కొన్ని కమాండ్ లను ఒక ఫైల్ గా చేసి రన్ చేయడం వంటి చిన్న చిన్న పనులనుండి,
ఒక క్రమమైన పధ్దతి లో కమాండ్స్ రన్ చేస్తూ, యూజర్ ఇన్ పుట్ తీసుకుంటూ, రన్ అయ్యే కాంప్లికేటెడ్ ప్రోగ్రాంలు కూడా తయారు చేసుకోవచ్చు
బూట్ సీడీ లలో కనిపించే
Press Any Key To Continue...

Select Option
వంటి కమాండ్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది,
అయితే అవన్నీ ఈ బ్యాచ్ ఫైల్స్ ద్వారానే చేస్తారంటే ఆశ్చర్యం కలుగక మానదు

అయితే బ్యాచ్ ఫైల్స్ తయారు చేసుకోవడానికి DOS కమాండ్స్ తెలిసి ఉంటే చాలు, హాయిగా తయారు చేసుకోవచ్చు
ఈ ట్యుటోరియల్ లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వరకు కాకుండా బేసిక్ గా బ్యాచ్ ఫైల్స్ అంటే ఒక అవగాహన వచ్చేలా చేయడమే నా ఉద్దేశ్యం (ఇంకా తెలిసిన వాళ్లు దీనికి రిప్లై లు గా అదనపు సమాచారం ఇవ్వగలరు)

బ్యాచ్ ఫైల్స్ ని DOS-Prompt నుంచే తయారు చేసుకోవచ్చు లేదా Notepad వంటి టెక్స్ట్ ఎడిటర్లలోనూ తయారు చేసుకోవచ్చు

అయితే మనం ఇక్కడ సింపుల్ గా Notepad లో తయారు చేద్దాం..

ముందుగా Notepad ఓపెన్ చేసి:
అందులో మనకి కావాల్సిన కమాండ్ లను ఒక దాని క్రింద ఒకటి టైప్ చేసుకుని
ఇక్కడ నేను ఉదాహరణకి
dir
dir/w
cd..
dir అనే
నాలుగు కమాండ్స్ ఇస్తున్నాను




ఆ తర్వాత ఆ ఫైల్ ని సేవ్ చేసుకోవాలి





అయితే సేవ్ చేసే సమయం లో ఆ ఫైల్ కి .bat ఎక్స్ టెన్షన్ ఉండేలా సేవ్ చేసుకోవాలి



ఫైల్ .bat ఎక్స్టెన్షన్ తో సేవ్ అవ్వాలంటే ఫైల్ నేం కి ఇరువైపులా కోట్స్ (") వాడాలి,


లేకుంటే

ఆ ఫైల్ batchfile1.bat.txt గా సేవ్ అవుతుంది,
మనకి batchfile1.bat గా కావాలి

ఇప్పుడు మనం ఆ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేశామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే, అందులో ఆ ఫైల్ ఈ విధం గా కనిపిస్తుంది



దాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా, రన్ చేసుకోవచ్చు,
లేదా కమాండ్ ప్రాంప్ట్ నుంచైతే ఆ ఫైల్ పేరుని batchfile1.bat


లేదా జస్ట్ batchfile1 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా రన్ చేయొచ్చు



మనం రన్ చేయగానే మనకి నాలుగు కమాండ్స్ లలో చివరి కమాండ్ ఎక్జిక్యూట్ అయ్యాక వచ్చే రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది
ఎందుకంటే మనం ఏ కమాండ్ తర్వాత ఆపమని చెప్పలేదు కాబట్టి ఒక్కోటి ఎక్జిక్యూట్ అవుతూ చివరివరకూ వచ్చాయన్నమాట



రన్ చేయగానే అన్ని కమాండ్ లు ఎక్జిక్యూట్ అయ్యాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే
ఈ స్క్రోల్ బార్ ని పైకి జరుపుతూ గమనించండి



అన్ని కమాండ్ లు వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి

ఈ విధంగా మనం ఒక చిన్న బ్యాచ్ ఫైల్ ని తయారు చేసుకున్నాము,
అయితే పైన నాలుగు కమాండ్స్ లలో ఒక్కోదాని మధ్య pause కమాండ్ ఉపయోగించి కమాండ్ లను ఆపుతూ చూడొచ్చు
అంటే ఇలాగన్నమాట

dir
pause
dir/w
pause
cd..
pause
dir

ఇలా చాలా చాలా కమాండ్స్ ఉంటాయి అవి ఒక్కోటిగా నేర్చుకుందాం
అందాక మీరూ ట్రై చేయండి


జీవి

0 comments: