Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

నే వెళ్లిపోతాను

నే వెళ్లిపోతాను,
చీకటి కప్పిన ఈ లోకాన్నీ, ఈ చీకటినీ
విదిలించుకుని, విశాలమైన ఆ వినీల గగానానికి,

నే వెళ్లిపోతాను
ఆలోచనలకు, ఆనందానికి చోటునిచ్చే
ఆ అనంత దూరాలకు,

నే వెళ్లిపోతాను,
మనుషులకే కాదు, మనసులకు కూడా
చోటు లేని ఈ ఇరుకైన లోకాన్ని వదిలి,

నే వెళ్లిపోతాను,
కవనానికి, కలలకూ
కావలసినంత చోటిచ్చే ఆ ఊహా లోకానికి...

( 1 ఫిబ్రవరి, 1999, రాత్రి 11 గం.)

0 comments: