Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

BSNL2-8 Happy Hours లో తనంతట తాను కనెక్ట్ అయి డౌన్లోడ్ చేసుకుని మళ్లీ డిస్కనెక్ట్ అవ్వాలంటే(Automatic-Connect-Disconect)

BSNL Broadband వాడేవాళ్లు హ్యాపీ అవర్స్ లో డౌన్లోడ్ లు చేసుకోవాలంటే , రాత్రంతా మేల్కోనవసరం లేదు,

ఈ క్రింది విధంగా చేసి ఆ పని మన కంప్యూటరే చేసి పెట్టేలా చేయొచ్చు ... అదెలా గంటే చదవండి
ఇక్కడ 1. µTorrent తో అయితే 2.ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ తో అయితే ఎలాగో చూద్దాం


.µTorrent వాడుతున్నట్లయితే,

µTorrent ఉదయం 2 గం నుండి 8 గం మధ్యే డౌన్లోడ్ చేసేలా కాన్‌ఫిగర్ చేసుకోవాలి
అందుకోసం

క్రింది పటంలో చూపినవిధంగా వీల్ లా ఉన్న పసుపురంగు బటన్‌ పై క్లిక్ చేసిఆతర్వాత వచ్చే విండో లో

Scheduler ( పై క్లిక్ చేసి ) సెలెక్ట్ చేసుకునిప్రక్కన నీలిరంగులో ఉన్నవిధంగా 2 గం నుండి 8 మధ్యలో మౌస్ తో మార్క్ చేసుకొనిOK బటన్‌ క్లిక్ చేయాలి

దీనితో µTorrent సెట్టింగ్ పూర్తవుతుంది , అంటే µTorrent కేవలం 2 నుంచి 8 గం మధ్య మాత్రమే డౌన్లోడ్ చేస్తుంది

ఇప్పుడు సిస్టం ఆటోమాటిక్ గా నెట్ కి 2.05 ని, కనెక్ట్ అయ్యేలా చేసుకోవాడానికి , మరియు 7.50 కి డిస్కనెక్ట్ అయ్యేలా చేసుకోడానికి

ఇక్కడ మనం 2 ఫైల్స్ తయరు చేసుకోవాలి

1.Connect.bat
2.Disconnect.bat

మొదట Connect.bat తయారు చేసుకోడానికి
Notepad ఓపెన్‌ చేసు ఇలా టైప్ చేయండి
rasdial [మీకనెక్షన్‌పేరు] [యూజర్ పేరు] [పాస్ వర్డ్ ]

ఉదాహరణకు :
ఇక్కడ
BsnlDataOne మన కనెక్షన్‌ పేరు (అంటే దేన్నయితే ఓపెన్‌ చేయడం ద్వారా మన కనెక్షన్‌ స్టార్ట్ అవుతుందో దాని పేరు )
ఇక్కడ చూడండి


myusername అనేది నా నెట్ కనెక్షన్‌ యూజర్‌ నేం
mypassword అనేది నా నెట్ కనెక్షన్‌ పాస్ వర్డ్ అనుకున్నట్లైతే

మనం నోట్ పాడ్ లో టైప్ చేయాల్సింది
rasdial BsnlDataOne myusername mypassword

ఇప్పుడు ఈ ఫైల్‌ ని "Connect.bat" గా " లు ఉపయోగించి సేవ్ చేసుకోండి ఇలా
ఇప్పుడు Disconnect.bat తయారు చేసుకోడానికి
Notepad ఓపెన్‌ చేసు ఇలా టైప్ చేయండ
rasdial /disconnect

ఇప్పుడు ఈ ఫైల్‌ ని "Disconnect.bat" గా " లు ఉపయోగించి సేవ్ చేసుకోండి ఇలా
దీనితో 2 ఫైల్స్ సిద్దం, ఇప్పుడు XP Scheduler ని ఉపయోగించి ఈ ఫైల్స్ ఎప్పుడు రన్‌ కావాలనేది మనం నిర్ణయిస్తాము
నిర్ణయించిన సమయంలో అవి రన్‌ అవుతాయి ,
అంటే Connect.bat ఉదయం 2.05 కి రన్‌ అయ్యేలా చేస్తే నెట్ అప్పుడు కనెక్ట్ అవుతుంది
అలాగే Disconnect.bat ఉదయం 7.55 కి రన్‌ అయ్యేలా చేస్తే నెట్ అప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది ్

Schedule చేయడం


Start--> All Programs -->Accessories--> System Tools --> Scheduled Tasks

ద్వారా ఇది ఓపెన్‌ అవుతుందిఇందులో Add Scheduled Task పై క్లిక్ చేసి
ఆ తర్వాత వచ్చే విండో లో Next క్లిక్ చేసి
ఆ తర్వాతి విండో లో Browse బటన్‌ పై క్లిక్ చేయాలిఇప్పుడు వచ్చే విండోలో మన Connect.bat ఫైల్ ను సెలెక్ట్ చేసుకుని Open బటన్‌ పై క్లిక్ చేయాలిఇప్పుడు Daily రేడియో బటన్‌ పై క్లిక్ చేసి Next బటన్‌ పై క్లిక్ చేయాలిఇప్పుడు పైన టైం 2.05 AM గా మార్చుకుని , Everyday సెలెక్ట్ చేసుకుని Next బటన్‌ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు వచ్చే విండో లో ఏమీ మార్చకుండా Next బటన్‌ పై క్లిక్ చేయాలి


ఇప్పుడు వచ్చే విండో లో
Open Advanced properties for this task when I click Finish
అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని Finish పై క్లిక్ చేయాలి
ఇప్పుడు వచ్చే మెసేజ్ బాక్స్ లో OK పై క్లిక్ చేయండి
ఇప్పుడు వచ్చే విండోలో Run Only if Logged On ను సెలెక్ట్ చేసుకుని OK పై క్లిక్ చేయండిఇప్పుడు Connect.bat ఫైల్ Scheduler లో వస్తుంది అంటే మనం సెట్ చేసుకున్న సమయానికి అది ప్రారంభమవుతుంది


అదే విధంగా Disconnect.bat ఫైల్ ని Scheduler లో చేర్చుకోవాలి అయితే ఇక్కడ టైం మాత్రమే మారుతుంది మిగతా అన్ని స్టెప్ లు పై విధంగానే ఉంటాయి , ఇలా


ఇప్పుడు Scheduler ఈ విధం గా కనిపిస్తుంది
దీంతో మన పని పూర్తయింది , మీరు ఇక ముందు నెట్ Disconnect చేసి, మానిటర్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపొండి నెట్ దానంతటదే 2.05 గం లకు కనెక్ట్ అయి మళ్లీ 7.55 గం లకు డిస్కనెక్ట్ అవుతుంది
అంతలో మన µTorrent తన పని తాను చేసుకుంటుంది
హ్యాపీ డౌన్‌ లోడింగ్
-------------మన పని ఇక్కడికి పూర్తయింది -----------అయితే ఇది అదనం---------------------------------
అయితే Internet Download Manager ను ఉపయోగించి కూడా చాలా సులభంగా నెట్ కనెక్ట్ , డిస్కనెక్ట్ అయ్యేలా చేసుకోవచ్చు అలాగే Downloads పూర్తయ్యాక సిస్టం ఆఫ్ అయ్యేలా చేసుకోవచ్చు

అయితే ఈ పద్దతిలో కూడా సిస్టం షట్ డౌన్‌ లేద హైబర్నేట్, అవడానికి ఒక ఫైల్ తయరు చేసుకుని పై విధంగా 8 గం ల కు రన్‌ అయ్యేలా చేసుకుంటే అది షట్ డౌన్‌ లేదా హైబర్నేట్ కూడా అవుతుంది

Shutdown.bat ఫైల్ లో
D:\Windows\System32\shutdown.exe -s

Hibernate.bat ఫైల్ లో
C:\WINDOWS\system32\rundll32.exe PowrProf.dll, SetSuspendState

ఉందాలి అంతే

Internet Download Manager తో ఎలా చేయాలనేది తర్వాతి ట్యుటోరియల్ లో తెలుసుకుందాము

1 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్

May 18, 2008 at 11:12 PM

జీవి గారు. ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. ప్రశాంతంగా నిద్రపోతూ డౌన్ లోడ్ ఆటోమాటిక్ గా ఫ్రీ అవర్స్ లో చేసుకోవటం కోసం ఇంత మంచి వెసలుబాటు ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.