Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

నేనేం పాపం చేశాను ?


అమ్మ ఎవరో తెలీదు ,
ఆకలని అడగడానికి

నాన్న ఎవరో తెలీదు ,
నోరారా పిలవడానికి

అన్నయ్య ఎవరో తెలియదు ,
అలిగి అల్లరి చేయడానికి

గూడంటే తెలియదు ,
గుర్తుంచుకోడానికి

ప్రేమంటే తెలియదు ,
పెనవేసుకోడానికి

నాపేరే తెలియదు ,
నన్ను నేను పరిచయం చేసుకోడానికి

ఎందుకు?
నేనేం పాపం చేశాను ?

(అనాథ పిల్లలను చూడగానే, వారి మనసు లో ఏముండవచ్చని అనిపించి)

1 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్

March 19, 2008 at 10:49 PM

మనసుని కదిలించే చక్కని కవితని అందించారు. అనాధలన్న భావమే కడుపుని కోస్తుంది. "నాకోసం చెమ్మగిల్లు నయనంబులేదు..." అన్నది గుర్తుకొచ్చి మనసంతా బాధతో నిండిపోతుంది అలాంటి వారిని చూసి.