Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

ఇంకెప్పుడో ?

ఆకాశం ఒక్కసారిగా
భళ్లున పగిలి,
అందులోంచి ఒక
అద్భుతం జనించాలేమో?

సాగరమే చప్పున
తనదారిని మళ్లించి
సమరాన్నే కొనసాగించాలేమో?

ఎడారిలా మారిన ఈ
ఎదలు, ఎప్పుడు
ఏ మార్పులకు తమ
ఎదుటి అవస్థను గుర్తిస్తాయో?

కుంచిత భావాలతో
కృళ్లిపోతున్న ఈ
కులవ్యవస్థలు ,

అంతానికి అరడుగు దూరంలో
ఆటాడుతున్న ఈ
ఆలోచనలు,

నాశనానికి చేరువలో
నాట్యమాడుతున్న ఈ
నరజాతి నిజాయితీ,

మారేదెన్నడో ?
ముక్తింకెప్పుడో ??

జీవనసారం తెలియని
జీవితాలు ముగిసేదెప్పుడో ?
కాలంతీరని బ్రతుకులకు
కన్నీళ్లింకెన్నాళ్లో ?



( 12-02-1999 మ 12.30 )

0 comments: