Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

లోకమంతా మోసగాళ్లతో నిండి పోయింది

లోకమంతా మోసగాళ్లతో నిండి పోయింది

డబ్బు కోసం కొందరు ,
డాబు కోసం కొందరు

పదవికోసం కొందరు ,
పరాచకానికి కొందరు

మనిషిని మోసం చేసేవాళ్లు కొందరు ,
మనసును మోసం చేసే వాళ్లు కొందరు

మోసపోయిందెవరో మోసగించేవారికే తెలియదు ,

తనను తాను మోసం చేసుకున్నానని
తెలుసుకున్న రోజు అనుకుంటాడు ,

లోకమంతా మోసగాళ్లతో నిండి పోయిందని ,
అది తనలాంటి వాళ్లతోనే ననీ

కానీ అప్పటికే విధాత అతన్ని మోసం చేసేస్తాడు ,
నీదనుకున్న జీవితం నీది కాదని తేల్చేస్తాడు

లోకమంతా మోసగాళ్లతో నిండి పోయింది !

(నన్ను ఎవరైనా మోసగించడానికి ప్రయత్నించినప్పుడు, కోపం బదులు నవ్వు వస్తుంది.అప్పుడు అనిపిస్తుంది "నాకు మరొకడు బాకీ పడ్డాడని " )

0 comments: