Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

ఫైర్ ఫాక్స్ లో ఏదైనా సైట్ ని 1-2 అక్షరాలు టైప్ చేయ్డడం ద్వారా ఓపెన్‌ చేయండి లా (Open any Website by Typing Only 1 or 2 letters in Firefox)

ఫైర్ ఫాక్స్ లో బుక్ మార్క్ చేసుకున్న ఏ సైట్ అయినా ని 1-2 అక్షరాలు టైప్ చేయ్డడం ద్వారా ఓపెన్‌ చేయండిలా..

మామూలుగా మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్‌ చేయాలన్నా

దాని పూర్తి URL ని అడ్రస్ బార్ లో టైప్ చేయడం ద్వారా లేదా దాని బుక్ మార్క్ ని క్లిక్ చేయడం ద్వారా ఓపెన్‌ చేస్తాం, ఉదా: యాహో మెయిల్



అలా కాకుండా కేవలం ఒకటి లేదా రెండు అక్షరాలు

మాత్రమే టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా ఆ సైట్ నిఓపెన్‌ చేయగలిగితే చాలా బాగుంటుంది కదా..


అదెలా సాధ్యం అనుకుంటున్నరా ?
అది చాలా సులభం చూడండి.
ఈ విధంగా చేయడం ద్వారా మీరు కూడా ఏ వెబ్ సైట్ నయినా క్షణాల్లో 1-2 అక్షరాలతో ఓపెన్‌ చేయగలరు

ఇక చదవండి




గమనిక : STEP-1 మరియు STEP-2 లు సైట్ ముందే బుక్ మార్క్ చేసి ఉంటే అవసరం లేదు , STEP-3 నుండి చేసుకుంటే చాలు. STEP-1 STEP-2 లకు బదులు Ctrl+D కీలను కలిపి ప్రెస్ చేయడం ద్వారా కూడా చేయవచ్చు

STEP-1
మొదట మనకు కావాల్సిన సైట్ ని మామూలుగా ఓపెన్‌ చేసుకోవాలి (అంటే పూర్తి అడ్రస్ టైప్ చేయడం ద్వారా లేదా బుక్ మార్క్ ని క్లిక్ చేయడం ద్వారా)





STEP-2
సైట్ ఓపెన్‌ చేశాక, దాని టాబ్ పై Right Click చేసి ,











ఇప్పుడు వచ్చే మెనూ లో Bookmark This Tab... పై క్లిక్ చేసి ,










ఇప్పుడు వచ్చే విండోలో OK ప్రెస్ చేయాలి









STEP-3
పై స్టెప్ తో మనకు కావాల్సి న సైట్ మన బుక్ మార్క్ లలోకి
వచ్చేస్తుంది
ఇప్పుడు
Menu Bar లో Booksmarks పై క్లిక్ చేసి


మన లింక్ పై (బుక్ మార్క్ పై ) Right Click చేయాలి















STEP-4
ఇప్పుడు వచ్చే మెనులో Properties పై క్లిక్ చేయాలి















STEP-5

ఇప్పుడు వచ్చే విండో లో Keyword అని ఉన్న దాంట్లో
మనం ఈ సైట్ ని ఏ కీ తో లేదా ఏమి టైప్ చేయడం
ద్వారా ఓపెన్‌ చేయాలనుకుంటున్నామో అది టైప్ చేసి
OK పై క్లిక్ చేయాలి
ఉదా. ఇక్కడ యాహూ మెయిల్ ని ఓపెన్‌ చేయడానికి
Keyword గా 'ym' ఇస్తున్నాను కాబట్టి ఇకముందు అడ్రస్ బార్ లో కేవలం 'ym' టైప్ చేస్తే చాలు యాహూ మెయిల్ ఓపెన్‌ అవుతుంది .

ఇలా ఇక్కడ చూడండి ------------------------>>>>







ఓకే ఇక ముందు పెద్ద పెద్ద url లను టైప్ చేయకుండా సులభంగా సైట్ లను ఓపెన్‌ చేయండి.

3 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్

March 8, 2008 at 10:04 PM

జీవీ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

Srinivas

March 9, 2008 at 11:31 PM

Thank you very much for your good and valuable information.

Srinivas Kara

Anonymous

April 28, 2008 at 8:48 PM

Gv garu good information thanks