Gv-World

జీవి బ్లాగ్ కు స్వాగతం..

తెలుగు లో కంప్యూటర్ విషయాలను అందరితో పంచుకోడానికి ప్రారంభించిన బ్లాగ్ ఇది,

Unable to See Telugu Fonts? Click Here
Want to Type in Telugu then Click Here


గోపాల్ వీరనాల

10 Steps లో Windows XP ని ఇంస్టాల్ చేయండిలా(Installing WIndows XP in 10 Steps)

10 స్టెప్పుల్లో విండోస్ XP ని ఈ క్రింది విధంగా install చేయవచ్చు,
Windows XP ఇన్ స్టాల్ చేయడం చాలా సులభం,
ఈ పోస్ట్ (టపా)లో అది ఎలా చేయాలో మీరు కేవలం 10 అంచెలలో BIOS Settings దగ్గరనుండి, విండోస్ పూర్తి అయ్యేవరకు నేర్చుకుంటారు, మీకు సులభంగా అర్థమవ్వడానికి దాదాపు 40 కి పైగా పటాలు (Screen Shots) జతపరుచడమైనది ఇక చదవండి

Step:1 CD నుండి Boot అవ్వడానికి BIOS సెట్టింగ్స్ మార్చడం
(గమనిక:ఈ స్టెప్ మథర్ బోర్డ్ ను బట్టి కొద్దిగా వేరుగా ఉండవచ్చు)

ముందుగా XP సీడి ని సిద్దంచేసుకోండి
installation ప్రారంభించాలంటే System సీడీ నుండి Boot అవ్వాలి,
అందుకోసం ముందుగా Boot Settings ని మార్చుకోవాలి అందుకోసం

System Boot అవ్వకముందే

Del లేదా F1 లేదా F2 బటన్ లలో మన System సంబందించిన Setup Key ఏది ఉంటే అది Press చేసి
BIOS Setup లోకి వెళ్లి ,



Boot Options లో

CD Drive ముందుగా ఉండేలా మార్చుకుని, Save చేసి Exit అవ్వాలి.

Step:2 Windows XP ఇంస్టాలేషన్ ను ప్రారంభించడం
ఇప్పుడు CD Drive లో XP CD ఉంచి System Start చేయాలి,

మొదట CD నుండి Boot అయితే ఈ క్రింది విధంగా Press any Key to Boot from Cd... అని వస్తుంది

కీబోర్డ్ పై ఏదేని కీ ని ప్రెస్ చేయండి (గమనిక: System Restart అయిన ప్రతి సారి ఇలానే అడుగుతుంది కానీ మనం మొదటిసారి మాత్రమే కీ ప్రెస్ చేయాలి,ఆ తర్వాత చెయ్యకూడదు)

ఆ తర్వాత వచ్చే విండో లో Enter ప్రెస్ చేయండి

ఆ తర్వాత వచ్చే విండో లో F8 ప్రెస్ చేయండి
Step:3 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఎంచుకోవడం

Enter=Install C=Create Partition F3=Quit అని వచ్చినపుడు మనం Windows XP ఇంస్టాల్ చేయాలనుకున్న డ్రైవ్ ని Arrow Keys తో Select చేసుకుని Enter ప్రెస్ చేయండి

Step:4 ఇంస్టాలేషన్ డ్రైవ్ ను ఫార్మేట్ చేయడం
ఆ తర్వాత వచ్చే విండోలో Format the Partition using the NTFS File System అనే ఆప్షన్ ను కీబోర్డ్ Arrow Keys తో Select చే్సుకుని,

Enter ప్రెస్ చేయండి

ఇప్పుడు System ని Restart చేయడానికి Enter ప్రెస్ చేయండి

Restart అయ్యాక Press any Key to Boot from CD అని వస్తుంది
ఇక్కడ ఏ కీ ప్రెస్ చేయవద్దు


ఇప్పుడు Windows XP Setup స్టార్ట్ అవుతుంది

Step:5 మన సొంత అంశాలను ఎంచుకోవడం

Setup లో Regional and Language Options మార్చమని వచ్చినపుడు
Customize
పై క్లిక్ చేయండిఇప్పుడు Regional and Language Options విండో వస్తుంది
ఈ విండో లో క్రింది బాగాన Location అని ఉన్న చోట India (మన దేశం) పేరుని ఎంచుకొండి.


Step:6 XP లో తెలుగు ఫాంట్స్ చదవడానికి మరియు టైప్ చేయడానికి సెట్టింగ్ లను మార్చుకోవడం

ఇప్పుడు పైన
Languages
అనే Tab ని క్లిక్ చేయండి
అందులో
Install files for complex script and right-to-left languages (including Thai)
అన్న ఆప్షన్ ముంది చెక్(Right Mark వచ్చేలా) చేసిక్రింద
Apply
బటన్ పై క్లిక్ చేయాలి-విండోని క్లోజ్ చేయవద్దు.
ఇప్పుడు
Details
బటన్ పై క్లిక్ చేయాలిఇప్పుడు Add బటన్ పై క్లిక్ చేయాలిఇప్పుడు వచ్చే Add input language అనే విండో వస్తుంది

అందులో Input language లో
Telugu
Keyboard layout/IME
లో
Telugu
ఎంచుకొని OK
బటన్ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు OK బటన్ పై క్లిక్ చేయాలి

ఇప్పుడు Next బటన్ పై క్లిక్ చేయాలి



Step:7 మన పేరు ,కంపనీ పేరు ఎక్స్ పీ కీ లను,పాస్ వర్డ్ లను ఇవ్వడం

ఇప్పుడు వచ్చే విండో లో
మీ Name మరియు మీ Organization టైప్ చేసి Next బటన్ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు మీ Windows XP CD Box పై ఉన్న Product Key
ని టైప్ చేసి Next బటన్ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు వచ్చే విండో లో
మీ Computer Name మరియు మీ Administrator password మరియు Confirm password
లలో నింపి Next బటన్ పై క్లిక్ చేయాలి

గమనిక ఇక్కడ ఇచ్చే Password ని గుర్తుంచుకోవాలి (రాసి పెట్టుకోండి)

Step:8 మన ప్రాంతాన్ని ఎంచుకోవడం
ఇప్పుడు వచ్చే విండోలో
Date & Time ని సరిచేసుకుని
Time Zone లో మన Time Zone (భారత దేశానికి GMT +5.30) ఎంచుకుని

Next బటన్ పై క్లిక్ చేయాలి


ఆ తర్వాత Installation Continue అవుతుంది

Step:9 నెట్ వర్క్ సెట్టింగ్ లను ఇవ్వడం

ఇప్పుడు వచ్చే విండోలో Typical settings ( సర్వసాధారణంగా అందరికి అవసరమయ్యే వి ) ఎంచుకుని
Next బటన్ పై క్లిక్ చేయాలి
Custom settings
( మీకు Windows XP లో ఏమి కావాలో, ఏవి వద్దో ఎంచుకోవచ్చు)
ఇప్పుడు Workgroup సెట్టింగ్స్ లో మీకు ఏదైనా Workgroup ఉంటే ఆ పేరు టైప్ చేయండి (ఇది Network లో ఉన్న కంప్యూటర్ లకు అవసరం) లేదా ఉన్నదాన్ని మార్చకుండా అలాగే ఉంచి
Next బటన్ పై క్లిక్ చేయాలి
ఉన్నదాన్ని మార్చకుండా అలాగే ఉంచి Next బటన్ పై క్లిక్ చేయాలి
Restart అయ్యాక Press any Key to Boot from CD అని వస్తుంది

ఇక్కడ ఏ కీ ప్రెస్ చేయవద్దు
Step:10 XP ని ప్రారంభించడం
ఇప్పుడు Display Settings మెసేజ్ బాక్స్ వస్తుంది
OK బటన్ పై క్లిక్ చేయాలి


ఇప్పుడు Monitor Settings మెసేజ్ బాక్స్ వస్తుంది
OK బటన్ పై క్లిక్ చేయాలి
ఇప్పుడు Administrator పై క్లిక్ చేసి
మీరు Installation టైం లో ఇచ్చిన Administrator Password ని టైప్ చేసి బాణపు గుర్తు పై క్లిక్ చేయండి
ఇదిగో మీ Windows XP లోడయింది


ఇక మిగిలిన పని మీ System తో బాటు వచ్చిన Mother Board CD (Intel,MSI etc.) ని CD Drive లో ఉంచి
డ్రైవర్స్ install చేసుకోవడమే
అప్పుడే Display,Sound, Network కార్డ్ మొదలయినవి సరిగా పనిచేస్తాయి .
ఆతర్వాత మీరు కావాల్సిన User లను Control Panel లో User Accounts
లో Create చేసుకోవచ్చు.

ఇక Windows XP ని ఎంజాయ్ చేయండి.

జీవి.

0 comments: